Posts

Showing posts from February, 2025

తిరుపతిలో రచయితల నిరసన‍

Image
మంగళవారం సాయంత్రం తిరుపతి రోడ్ల మీద రచయితలు, కళాకారులు కదం తొక్కారు. కారణం ఏమిటంటే .. తిరుపతిలో రెండు రోజుల ముందు పుస్తక ప్రదర్శన జరిగింది. ఆ ప్రదర్శనలో కొంతమంది విశాలాంధ్ర బుక్ స్టాల్ మీద దాడి చేశారు. హిందూ మతానికి‍ వ్యతిరేఖంగా ఉన్నాయి అని కొన్ని పుస్తకాలను చించి బయటకు విసిరేశారు.  జెన్ కిరణ్ కుమార్ అనే ప్రధాన నింది‍తుడి మీద విశాలాంధ్ర సేల్స్‌మన్ శంకరయ్య పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు.  ఇలాంటి సంఘటనే మొన్న హైదరాబాద్ పుస్తక ప్రదర్శన లో కూడా జరిగింది .  ప్రభుత్వం నిషేధిం‍చని ఏ పుస్తకాన్ని అయినా అమ్మే హక్కు ప్రచురణకర్తలకు ఉంటుంది.  అలా కాదు, ఈ పుస్తకం నాకు నచ్చలేదు కాబట్టి నువ్వు అమ్మొద్దు , అంటే ఎలా?  ఇలా కొంతమంది వ్యక్తులే ఏది అమ్మా‍లో, ఏది అమ్మకూడదో డిక్టేట్ చేస్తుంటే ఇక కళాకా‍రులకు స్వేచ్చ ఏం  ఉంటుంది?  ఇలా ఎవడు పడితే వాడు మోరల్ పోలీసింగ్ చేస్తుంటే ఇక రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటనా హక్కు కు అర్థం ఏం ఉంటుంది ?  - సాయికిరణ్ పామంజి , 11/ 2 / 25