తిరుమల శ్రీవారికి వేంకటేశ్వర స్వామి అన్న పేరు ఎలా వచ్చిందో తెలుసా !
వేం అంటే చీకటి లేదా పాపం. కట అంటే తొలగించడం. వేంకటేశ్వరుడు అంటే మన పాపాలను తొలగించేవాడు, అని పండితులు చెబుతూ ఉంటారు. అయితే అది నిజమేనా!
ఆధ్యాత్మిక కోణంలో అయితే సరే అనుకోవచ్చు గానీ అసలు కారణం వేరే ఉంది అని చరిత్రకారులు చెబుతారు.
ప్రాచీనకాలంలో శేషాచల కొండలను 'వేంగడం కొండలు' అని పిలిచేవారు. అంటే తమిళదేశానికి దక్షిణ సరిహద్దులో ఉన్న తెల్లని కొండలు.
వేంగడం కొండల మీద వెలసిన స్వామి కాబట్టి ఆ స్వామిని వేంగడేశ్వరుడు అన్నారు. ఆ తర్వాత ఆ పేరు వేంకటేశ్వరుడు గా చలామణిలోకి వచ్చింది.
తిరుమల శ్రీవారి గురించి తొలి ప్రస్తావన దాదాపు రెండువేల సంవత్సరాల నాటి తమిళ గ్రంధమైన 'తొల్కాప్పియం' లో ఉంది.
ఆ సాహిత్యంలో స్వామివారిని 'కొండ మీద లోతట్టు ప్రాంతంలో వెలసిన స్వామి' అనే పేరుతో సంభోధించారు.
ఆ నాటికి స్వామివారికి ఎలాంటి గుడి లేదట. ఆరు బయట ఉన్న స్వామివారి విగ్రహాన్ని నేరుగా సూర్యుడు, చంద్రుడు అభిషేకిస్తూ ఉన్నారని 'తొల్కాప్పియం' పేర్కొంది.
అంతకుముందు స్వామివారిని తిరుమల కొండల్లో నివసించే ఆటవికులు మాత్రమే పూజిస్తూ ఉండేవారట.
- సాయికిరణ్ పామంజి
Comments
Post a Comment