Posts

Showing posts from November, 2024

వేంకటేశ్వర‍ స్వామి విష్ణువు అవతారమేనా !

 మహాభక్తుడు అన్నమయ్య ఓ కీర్తనలో చెప్పాడు .. ఎవరు ఎలా చూస్తే వేంకటేశ్వర‍ స్వామి వారు ఆ దేవుడిలా కనపడతాడు అని.  వైష్ణవ మతానికి సంబంధించి రెండు ఆగమాలు ఉన్నాయి. వైఖానసము‍ , పాంచరాత్రం. ఈ రెండు ఆగమాలు విష్ణువు విగ్రహాలు ఏ లక్షణాలతో ఉండాలో చెబుతాయి. అయితే వేంకటే‍శ్వర స్వామి వారి విగ్రహం ఈ ఆగమాల్లో చెప్పిన లక్షణాలు కలిగి ఉండదు.  అందువల్ల స్వామివారిని విష్ణుమూర్తి కారని ఎందరో ఈ నాటికీ అంటుంటారు.  రామానుజులవారు బ్రతికి ఉన్న కాలంలో శైవులు స్వామివారు శివుడని చెప్పి బలవంతంగా అర్చకులను తరిమేసి గుడిని ఆక్రమించుకున్నారు. కొన్ని రోజులు స్వామివారికి శైవపూజలు జరిగాయి.  అది తెలిసి రామానుజులు తిరుమలకు విచ్చేశాడు.  ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న యాదవరాజు న్యాయనిర్ణేతగా గొప్ప సభ జరిగింది.  శైవాచార్యుడు, రామానుజుల మధ్య గొప్ప వాదప్రతివాదం జరిగింది.  రామానుజుల వాదన గెలిచింది.  యాదవరాజు స్వామివారు విష్ణువు అవతారమే అని తీర్పు చెప్పారు.  భవిష్యత్తులో ఇలాంటి కలహం రాకూడదని రామానుజులు ఆలోచించి స్వామివారి హృదయానికి బంగారు లక్ష్మీదేవి బొమ్మను అమర్చాడు‍. స్వామివారి‍ రెండు భుజ...

తిరుమల శ్రీవారికి వేంకటేశ్వర స్వామి అన్న పేరు ఎలా వచ్చిందో తెలుసా !

వేం అంటే చీకటి లేదా పాపం. కట అంటే తొలగించడం. వేంకటేశ్వరుడు‍ అంటే‍ మన పాపాలను తొలగించేవాడు, అని పండితులు చెబుతూ ఉంటారు. అయితే అది నిజమేనా!  ఆధ్యాత్మిక కోణంలో అయితే సరే అనుకోవచ్చు గానీ అసలు కారణం వేరే ఉంది అని చరిత్రకారులు చెబుతారు.‍  ప్రాచీనకాలంలో  శేషాచల కొండలను  '‍వేంగడం కొండలు'‍ అని పిలిచేవారు. అంటే తమిళదేశానికి దక్షిణ సరిహద్దులో  ఉన్న తెల్లని   కొండలు.  వేంగడం కొండల మీద వెలసిన స్వామి కాబట్టి ఆ స్వామిని‍ వేంగడేశ్వరుడు అన్నారు. ఆ తర్వాత ఆ పేరు వేంకటేశ్వరుడు గా చలామణిలోకి వచ్చింది.  తిరుమల శ్రీవారి గురించి తొలి ప్రస్తావన దాదాపు రెండువేల సంవత్సరాల నాటి తమిళ గ్రంధమైన '‍తొల్కాప్పియం'‍ లో ఉంది.  ఆ సాహిత్యం‍లో స్వామివారిని '‍కొండ మీద లోతట్టు ప్రాంతంలో వెలసిన స్వామి'‍ అనే పేరుతో సంభోధించారు.    ఆ నాటికి స్వామివారికి ఎలాంటి గుడి లేదట.  ఆరు బయట ఉన్న స్వామివారి విగ్రహాన్ని నేరుగా సూర్యు‍డు, చంద్రుడు‍ అభిషేకిస్తూ ఉన్నారని '‍తొల్కాప్పియం'‍ పేర్కొంది.‍   అంతకుముందు స్వామివారిని తిరుమల కొండల్లో నివసించే ఆటవికులు మాత్రమే‍ పూజి...